వర్షం అంటే నాకారోజే గుర్తొస్తుంది.. నాకు తెలుసు తనకీ అలాగే గుర్తోస్తుందని.. ఆ రోజు..!!! గడిచి ఎన్ని రోజులైనా ప్రతీ కదలిక గుర్తుంది.. ఆ రోజు.. తనని చూడాలనే నా ఉద్వేగాన్ని ఆ రోజు వర్షం ఆపలేకపోయింది... ఆతృతగా వెళ్లి.... తన కోసం... ఎదురు చూస్తూ ఉండిపోయాను...ఎన్నో మట్లదాలనుకున్న నా మనసు తను రాగానే మూగబోయింది.. కళ్ళార్పకుండా.. తననే
చూడాలనుకున్న నా నయనాలు ఒక్కసారిగా వాలిపోయాయి... ఏమైంది....?? అనుకున్నాను ఒక్కసారి... అపుడే గుర్తొచ్చింది.. అమ్మాయినని....
తను మాట్లాడుతున్నాడు... నేను బదులిస్తున్నాను ... కాని... నాలో...నాకే తెలియని భావాలు.. మౌనంగా.. సవ్వడి చేస్తున్నాయి... ప్రతి గడియకి.. ఉప్పొంగే అలలా నా హృదయం ఉ
వ్వెత్తున ఎగసి పడుతుంది... తన పక్కన నడుస్తున్నననే భావనే నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.. ఊపిరి ఆగిపోతుందేమో అన్నంతగా.. గుండె బరువెక్కుతుంది....
తన చూపులు నా మనసుని సన్నగా మీటు తున్నాయి.. ఆ తన్మయత్వం తో.. మా మాటల్తో.. చాలా సేపు గడిచిపోయింది...
ఇక వెళ్దామా అన్నాడు... ఉలిక్కిపడి చూసాను .... నాకు వెళ్ళాలనిపించలేదు... తను దూరంగా వెళ్లి పోతాడేమో అన్నా ఆలోచననే నేను తట్టుకోలేక పోయాను.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి... ఎందుకో తెలీదు... ఆగకుండా కన్నీళ్ళు ప్రవహి
స్తూనే వున్నాయి...
ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది....వెచ్చగా తన చేతి స్పర్శ.. నమ్మలేకపోయాను..నా మనసు తెలిసిన వాడిలా నా చేయి ని ఇంకాస్త గట్టిగా పట్టుకుని.. నీకు నేనున్నాను అన్నాడు... జీవితానికి ఆ క్షణం చాలనిపించింది.. అ తర్వాత క్షణం నుండి నేనీ లోకం లో లేకపోయినా పర్వాలేదనిపించింది.. నా కళ్లు తనని ఆరాధనగా చూస్తున్నాయి.. తెలియ
కుండానే తన మీద వాలిపోయాను....
వర్షం లో.. నేను ...తను.. చేయి చేయి పట్టుకుని నడుతున్నప్పుడు కలిగిన అనుభూతికి మాటలు రాలేదు... మౌనం... పూర్తిగా మౌనం... "మనసులోని బావాలు చెలియలికట్ట దాటి
తే మిగిలేది.. పూర్తిగా మౌనమే ప్రియా..." అన్నా యండమూరి మాటలు గుర్తుకి వచాయి...
క్షణానికి క్షణానికి మద్య .....కాలం స్పందించలేక మిగిల్చిన నిశ్శబ్ధం లో....అడుగుకీ అడుగుకీ మద్య నాలో రగిలే సంఘర్షణ లో..తనకి నాకు మధ్య..మెల్లగా తరిగిపోతున్న దూరం లో... ఇద్దరం కలిసి అలాగే నడుస్తూ ఉండిపోయాము..

2 comments:
i dnt hav any words to say...realy awesome n superb
bagundi,
meeru kavithalu raaste chaala baguntundi. nice imagination in varnana..
Post a Comment