చాలాదూరం ప్రయనించాక , నాన్న వాళ్ల స్నేహితుడి వాళ్ళింటికి చేరాము..చాలా పెద్ద ఇల్లు.....ఇంటి చుట్టూ అందంగా అల్లుకున్న తీగలు....ఎన్నో రకాల పూల చెట్లు....ఇంటి పక్కనే...చిన్న సరస్సు....బాగుంది...
నాన్న వాళ్ళ స్నేహితుడిని పరిచయం చేసారు..ప్రకాష్ అంకుల్... నాన్న లాగే మిలటరీ ఆఫీసర్...మాకోసం ఇంటి దగ్గరే ఇంకో చిన్న ఇంటి ని ఏర్పాటు చేసారు... ఆ ఇల్లు కూడా బాగుంది...
ఇద్దరం కలిసి చాలా ఆడుకునేది... తను నేను ఒకటే స్కూల్... రోజు...కారులో..ఇద్దరం కలిసే వెళ్లి కలిసే వచ్చేది.. వచ్హాక ఇక తెగ అల్లరి చేసేవాళ్ళం...కానీ అంకుల్ వచ్చాడంటే మాత్రం..ఇద్దరం సైలెంట్ గా...పుస్తకాలు తీసి చదువుకునేవాళ్ళం....కిరణ్ స్నేహం తో.. మా అల్లరితో..రోజులు చాలా తొందరగా గడిచిపోయాయి....నాన్న అపుడపుడు ఫోన్లో మాట్లాడేవారు..ఎప్పుడో కాని చూడటానికి వచ్చేవాళ్ళు కారు... స్కూల్ లో కూడా చాలా అల్లరి చేసేదాన్ని...కానీ చదువులో ,ఆటల్లో మాత్రం ఫస్ట్ వచ్చేది.... ముఖ్యంగా బాస్కెట్ బాల్.... చాలా ఇష్టంగా ఆడే దాన్ని.. అందరి కన్నా ఎక్కువ గోల్స్ చేయడం అంటే చాలా సరదాగా ఉండేది నాకు..... అబ్బాయిలతో కూడా పోటీగా ఆడే దాన్ని...కిరణ్ తో ఎక్కువగా ఆడు కునేది..తను ఓడిపోతే చాలా ఆట పట్టించేదాన్ని....ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాం...
.................
...........................
...................................."ఆనంద్......"

1 comments:
awesome dear
Post a Comment