"ఆనంద్..."మొదటి సారి క్లాసు లో నేను సెకండ్ వచ్చాను...ఫస్ట్ ఎవరు వచ్చారు అని అడిగితే విన్పించిన పేరు అది...
"ఆనంద్.."
"ఆనంద్.."
స్కూల్ లో క్రొత్తగా చేరాడు... బాగా చదివే వాడు.. అప్పటివరకు మొదటి స్థానం లో ఉన్ననేను సెకండ్ వచ్చేసరికి కోపం వచ్చింది..."ఎవరీ అబ్బాయి... అంత బాగా చదువుతాడా.. ? నాకన్ననా..??" అనుకున్నాను... ఆ తర్వాత నేను కుడా బాగా చదివాను.. అలా ఇద్దరం పోటి పడేవాళ్ళం... ఒకసారి..తను ఫస్ట్ వస్తే ఇంకో సారి నేను ఫస్ట్ వచ్చేదాన్ని.... చదువులో నే కాదు..ఆటల్లో కూడా తను నాకు పోటీయే. బాస్కెట్ బాల్ నా కన్నా బాగా ఆడేవాడు..తనని ఓడించాలని చాలా ప్రయత్నించేదాన్ని..
ఒక రోజు అలాగే అందరం కలిసి బాస్కెట్ బాల్ అడుకుంటున్నాం.. ఆ రోజు..వర్షం పడుతుంది..అయినా కూడా సరదాగా ఉంటుందని..ఆ వర్షం లో నే ఆడుతూ ఉన్నాం.. 

ఆరోజు నేను బాగా ఆడుతున్నాను...కాని అంతలోనే చటుక్కున జారిపడ్డాను...అందరు ఒక్కసారిగా నవ్వారు...కోపమొచ్చింది..నాకేమో దెబ్బ బాగా తగిలింది..ఇంక అందరు అలా నవ్వేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి..లేవాలని ప్రయత్నించాను..కానీ లేవలేకపోయాను..
" అప్పుడో మెత్తని చేతి స్పర్శ నను తాకింది..." చప్పున తలెత్తి చూసాను...
"ఆనంద్...."
" అప్పుడో మెత్తని చేతి స్పర్శ నను తాకింది..." చప్పున తలెత్తి చూసాను...
"ఆనంద్...."
నన్ను లేపి..తనే పక్కకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు..వెంటనే వెళ్లి కిరణ్ ని తీసుకొచ్చాడు..
"నొప్పిగా ఉందా..?" అని అడిగాడు..
"ఊఁ.."అన్నాను...
"ఎం కాదు.. ..తగ్గిపోతుంది.." అన్నాడు...
అలాగే చూస్తూ ఉన్నాను తనని....అపుడే కిరణ్ చెప్పాడు తను ఆనంద్ అని..
"తెలుసు" అన్నాను..
"తను అంజలి...." అని చెప్పాడు ఆనంద్ కి...
" హూ..కాదు..అంజు..." అని చెప్పి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాను....

0 comments:
Post a Comment