స్కూల్ డేస్ తర్వాత నేను, కిరణ్,ఆనంద్ విడిపోయాం. ఇంటర్ లో కిరణ్ ఆనంద్ వేరే కాలేజీ.. నేను వేరే కాలేజీ.. అంతా కొత్త ప్రపంచం... కొత్త స్నేహితులు.. బాగుంది... కాలేజీ లో చేరేటపుడు ఏదో కొత్తగా చేయాలనే ఉత్సాహం.. అన్నీ సాదించాలనే పట్టుదల.. నన్ను నేను నిరుపించుకోవాలనే ఒక లక్ష్యం.. నన్ను ఉత్తేజపరిచేవి.. సోక్రటీస్ చెప్పినట్టు నీళ్ళల్లో మునిగినపుడు.. పైకి రావాలని ఎంతగా తపన పడతామో.. మనకూ అంతే తపన ఉండాలనే నాన్న మాటలు గుర్తు వచ్చేవి.. ఆ రెండేళ్ళు వేరే లోకం లేదు.. గెలుపు కోసం తపన మాత్రమే మిగిలింది.. మిగతావేవి పట్టించుకోలేదు..చదువు మీదనే ధ్యాస.. ఫలితం కాలేజీ ఫస్ట్..తర్వాత అడుగు ఎటువైపు వెళ్ళాలా అని ఆలోచించాను.. నాలా మంచి మార్క్స్ వచ్చిన వారందరూ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యారు.. కాని నాకు చేరలనిపించలేదు.. పుస్తకాల్లో అసలైన చదువు ఉండదు అనిపించింది.. నాన్న ఎపుడూ నీ మనసుకి అనిపించింది చేయమనేవారు.. నాకు కూడా అందరు నడిచే బాట లో వెళ్ళాలనిపించలేదు.. అందుకే జర్నలిజం, సైకాలజీ తీసుకున్నాను..
మనుషుల్ని..వారి మనసుల్ని పరిశీలించడం నా చదువు.. ఎంత బాగుంది..! నా బాల్యం అంతా ప్రకృతి ని గమనించడం లో నే గడిచిపోయింది.. ఇప్పుడు మనుషుల వంతు అనుకున్నాను..చాలా గమ్మత్తైన పని ఇది.. ప్రతి మనిషిలో ఇంత వైరుధ్యం ఉంటుందా అనిపించేది.. 'తనే గెలవాలనే అహంకారం.. ఇష్టమైన వాళ్ళని గెలిపించాలనే తపన.. ఓడిపోతాననే భయం.. బయటపడకూడదు అనే బింకం..' అంతా ఒక్కరిలోనే.. ఇంత వైరుధ్యంగా ఎలా ఉంటారు..? అనిపించేది.. ఇందంతా చదవటమే నా పని.. నాకు అలా గమనించడం నచ్చింది.. సైకాలజీ లో మన మన మనసు స్పందించే ప్రతి చిన్న విషయానికి విలువ ఉంది..మనల్ని మనమే తెలుసుకోవడం కొత్తగా అనిపించింది.. స్పందిచే నైజం ఎంత విలువైనదో అర్థం అయ్యింది..జీవితం అంటేనే ఒక స్పందన.. ఒక కదలిక.. ఒక లయ అని అర్థం అయింది.. కాని నిజ జీవితంలో ఈ విషయం చాల తక్కువ మందికి తెలుసు...
చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించడం అందరికీ రాదేమో అనిపిస్తుంది.. అదే వస్తే ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా ఉండే వారేమో కదా..! పెరట్లో తొలి వేకువ న విచ్చుకునే సూర్యోదయం... ప్రతి చినుకు లయబద్దంగా చేసే నాట్యం.. మనసు లో బావాలన్నింటినీ తట్టి లేపే వెన్నెల అందం.. పదాల పొందిక ఇంత అద్బుతంగా ఉంటుందా అనిపించే సాహిత్యం...ఇంకా చాలా.. ఇవన్నీ అనుభవించడానికి ఒక జీవితం చాలదేమో అనిపిస్తుంది.. మనిషి కీ మనసుకీ కూడా చాలా తేడా ఉంది.. కాలం గడుస్తున్న కొద్దీ చాలా నేర్చుకున్నాను.. మనుషుల భావాలూ.. అనుభవాలు.. ఇలా చాలా తెలుసుకున్నాను..ఇష్టమైన పని కష్టమనిపించదు.. అని ఎందుకంటారో అపుడే అర్థం అయ్యింది..
ఇదంతా ఒక ప్రపంచం.. కాని నాకు తెలియని ఇంకో ప్రపంచం ఉందని నాకు తెలీదు....
2 comments:
chala bagundi. appude aypoinda anipinchindi .good.
'తనే గెలవాలనే అహంకారం.. ఇష్టమైన వాళ్ళని గెలిపించాలనే తపన.. ఓడిపోతాననే భయం.. బయటపడకూడదు అనే బింకం..' అంతా ఒక్కరిలోనే..
nice feeling kada..?
Post a Comment