
స్కూల్ డేస్ తర్వాత కిరణ్ బాగా గుర్తోచ్చేవాడు.. కిరణ్ తో ఆడుకున్న రోజులు..వాళ్ళింట్లో గడిపిన రోజులు..బాగా మిస్సయ్యాను. తను సెలవులకు రావడం తక్కువే..నేనే ఎప్పుడైనా వీలు చూసుకుని ప్రకాష్ అంకుల్ వాళ్ళింటికి వెళ్లి వచేదాన్ని..తను అప్పుడప్పుడు ఫోన్చేసేవాడు.. మా కాలేజీ విషయాలు..ఫ్రెండ్స్ గురించి..మాట్లాడుకునే వాళ్ళం.. ఇదంతా మాములే..
కాని.. ఆనంద్ కూడా గుర్తోచ్చేవాడు..తన నవ్వు..ఆ నవ్వులో అమాయకత్వం..తన కళ్ళు..గుర్తొచ్చేవి..తనలా ఎవరు అయిన ఉన్నారనిపించినా.. తన పేరు వినిపించినా..అలోచించేదాన్ని..ఇప్పుడు ఎలా ఉన్నాడో అని అనుకునేదాన్ని... కిరణ్ ఎప్పుడైనా..
ఆనంద్ గురించి చెపితే..ఆసక్తిగా వినేదాన్ని..ఏమో..ఎందుకో తేలేదు..అంతగా తనతో మాట్లాడలేదు.. ఎక్కువగా గడపలేదు. అయినా.. ఎందుకు ఆలోచిస్తున్నానో తెలీదు.. ఎన్ని రోజులిలా చూద్దాం అనుకున్నాను.
.రోజులు గడుస్తున్నాయి.. డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉండగా దాది కి ఆరోగ్యం పాడయింది.. చాలా టెన్షన్ పడ్డాను.దాది ని హాస్పిటల్ లో చేర్పించాం..నాన్న కి ఫోన్ చేసి చెప్పాను. కాని నాన్న కి సెలవు దొరకలేదు.ప్రకాష్ అంకుల్ చూసుకున్నారు ఇక. చాలా రోజులు దాది హాస్పిటల్ లో నే ఉంది. చాలా ప్రయత్నాలు చేసాము.. కాని దాది ని ఎక్కువ రోజులు కాపాడలేక పోయాము. తను వెళ్ళిపోయింది.. చాలా బాధేసింది.. బాగా ఏడ్చేసాను.. అంకుల్ ఓదార్చారు.. కాని నేను ఊరుకోలేక పోయాను.. నాన్న కి చెప్పాము.. కానీ నాన్న రావడానికి ఒక రోజు పడుతుంది.. ఆ రోజు హాస్పిటల్ లో నే ఉన్నాం.. అంకుల్ నన్ను ఇంటికి వెళ్ళమన్నారు.. కానీ నాకు వెళ్ళాలి అని అనిపించలేదు.. అలాగే కుర్చుని ఏడుస్తూ ఉండిపోయాను

ఆ రోజు..మొదటి సారిగా బయపడ్డాను .. నాన్న కూడా పక్కన లేకపోయేసరికి ఇంకా ఒంటరిగా అనిపించింది..కళ్ళలో నీళ్ళు ఆగకుండా కారుతున్నాయి..అలాగే పడుకున్నాను..బాధతో..భయంతో..కన్నీళ్ళతో..అప్పుడే వచ్చింది ఆ కల.. నేను ఒంటరిగా..భయ పడుతూ వర్షం లో ఏడుస్తుంటే..ఒక అబ్బాయి నాకు దైర్యం చెప్పి..నన్నో అందమైన ప్రదేశానికి తీసుకెళ్ళాడు.. నేను తిరిగి చూసేలోపే.. తను వెళ్ళిపోయాడు..చివరగా పిలిచాను తనని..ఆనంద్ అని..
ఉలిక్కి పడి లేచాను.. అపుడే తెల్లవారుతుంది..హాస్పిటల్ వాసన గుప్పుమంది..దాది పక్కనే ఉన్నాను.. నన్ను ఒక చేయి ఆప్యాయంగా తడిమింది... తిరిగి చూసాను.. నాన్న..పట్టుకుని ఏడ్చేసాను...నన్ను ఓదార్చారు..కాని నాకు తెలుసు.. నా కన్నా ఎక్కువ నాన్న బాధపడతారని.. అయన కళ్ళల్లో ఆ బాధ తెలిసిపోతుంది.. అంకుల్,నాన్న కలిసి అన్ని కార్యక్రమాలు చేయించారు.. నాన్న కొన్ని రోజులు నాతోనే ఉన్నారు..నా గురించి చాలా బాధపడ్డారు.. నాతోనే ఇక్కడే ఉంటా అన్నారు.. నేను వద్దన్నాను.. నాన్న అవసరం చాలా మంది కి ఉంది అని అనిపించింది..అందుకే కాలేజీ హాస్టల్ లో ఉంటాను అని చెప్పాను..ఏమనలేదు.. కాని చాలా ధైర్యం చెప్పారు.. అమ్మ పోయినపుడు నాన్న కి ఎలా అనిపించిందో.. ఎలా తట్టుకుని ముందుకు సాగారో..అన్ని వివరంగా చెప్పారు.. నాన్న ఉన్నంత వరకు ధైర్యంగా నే ఉన్నాను.. నాన్న నన్ను హాస్టల్ లో చేర్పించి వెళ్ళిపోయారు.. నాన్న వెళ్ళాక ఏదో తెలియని భయం.. అప్పటి వరకు ఎప్పుడూ తెలియని ఒంటరి తనం..చాలా బాధించేవి..చాల రోజుల వరకు నేను అందులో నుండి బయటికి రాలేకపోయాను..
ఒక రోజు దాది..నాన్న.. చాలా గుర్తొచ్చారు.. అదే బాధ.. ఆగని కన్నీళ్ళు..ఎలాగో పడుకున్నాను.. ఆరోజు రాత్రి మళ్లీ.. అదే కల..ఇంకొంచం స్పష్టంగా.. కళ్ళు తెరచి చూసాను.. తెల్లవారిపోయింది..ఒక సారి కల అంతా గుర్తు తెచ్చుకున్నాను.. నా కల లో వచ్చింది ఆనంద్ కాదు.. అసలు ఆనంద్ ఇపుడు ఎలా ఉంటాడో కూడా నాకు తేలేదు..అయినా పిలిచాను..చాలా ఆత్రంగా.. ఎందుకలా..? ఏమి అర్థం కాలేదు.. అదే కల చాలా సార్లు వచ్చింది. ఎందుకు వచ్చిందో..తెలీదు. కాని ఆ కల తర్వాత నాకు చాల ధైర్యంగా అనిపించింది.. తన నవ్వు.. కలలో తను చెప్పిన మాటలు..తెలియని ధైర్యాన్ని ఇచ్చాయి..ఒంటరితనం కుడా బాధించలేదు.. ఆ తర్వాత నాకా కల రావడం అలవాటు అయింది..ఎప్పుడు బయపడినా ..ఆ కల, తన మాటలు గుర్తొచ్చేవి. మళ్లీ మాములుగా అయిపోయేదాన్ని.. కాని ఆనంద్ అనే ఎందుకు పిలిచాను? నాన్న ని కాని..కిరణ్ ని కాని పిలిచి ఉండవచ్చు కదా? ఏమో..తెలీదు. ప్రతి అమ్మాయికీ ఒక కలల రాకుమారుడు ఉంటాడు అంటారు.. నాకు ఆనంద్ అలానా? తన గురించి తెలీదు..అయినా ఏంటి ఈ కలలు..ఏంటి ఈ ఆలోచనలు..? ఏమిటి ఇదంతా? ఇష్టమా..? ఆకర్షణ..? తెలీదు ..దేనికి నా దగ్గర సమాధానం లేదు.. కాని..ఒకటి అనిపించింది..తన గురించి ఆలోచించడం నాకు ఆత్మ స్థైర్యాన్ని ఇస్తున్నపుడు..ఎందుకు ఆలోచించడం మానేయాలి అని.. ఆరోజు నుండి..ఆనంద్ నాలో ఒక బాగం అయిపోయాడు..అప్పటి నుండి..ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వలేదు.. అలా ఉండటం నాకు నచ్చింది.. తననేప్పుడూ కలవలేదు.. కలవాలని అనుకోలేదు..కలుస్తానో లేదో కుడా తెలీదు.. నేను మాత్రం ఆనంద్ ఇచే ధైర్యం తో ముందుకు సాగిపోయాను..
కాని జీవితం లో మనం అనుకోనివే జరుగుతాయి.. కలల లోకం లో విహరించే నేను కళ్ళ ముందు ఆనంద్ ని చూస్తానని అనుకోలేదు..కానీ చూసాను. .
1 comments:
choosaara..ekkada ?
bagundi mee narration..daanni pine unchandi (keep it up :-))
Post a Comment